విక్రమార్క రాజు మరియు భట్టి మంత్రులు
ఒక రోజు భట్టిమరియు విక్రమార్కా వేట కోసం అడవికి వెళ్ళారు. అక్కడ వారు కాళిమత ఆలయాన్ని చూశారు. అక్కడ 'పుష్కరిని' అనే చెరువు ఉండేది. ఆ చెరువు మధ్యలో 'త్రిశూల్' అనే మూడు ముఖాల ఆయుధం ఉంది. చెట్టు పైకి ఎక్కి ఎవరైనా తమ ప్రాణాన్ని అర్పించినట్లయితే వారిని కాళీమాత ఆశీర్వదిస్తుందని శిల మీద రాసి ఉంది. అది చదివిన విక్రమార్క ముందు వెనుక ఆలోచించకుండా చెట్టు ఎక్కి చెరువులోకి దూకాడు. ఆయుధం అతని గుండెలోకి చొచ్చుకుపోయింది. అప్పుడు కాళీమాత ప్రత్యక్ష మై విక్రమార్కను సజీవంగా చేసింది. ఆమె అతన్ని ఒక వరం ఇస్తూ నీవు నీ సామ్రాజ్యాన్ని వెయ్యి సంవత్సరాలు నిరంతరం పలిస్తావు అని చెప్పింది .అప్పుడు విక్రమార్క భట్టిని కలుసుకుని ఏమి జరిగిందో చెప్పాడు. వారు సంతోషంగా వారి సామ్రాజ్యానికి తిరిగి వెళ్లిపోయారు
కొంత కాలం తరువాత విక్రమార్క అసంతృప్తి చెందసాగాడు. నీ అసంతృప్తి కి కారణంఏమిటని బట్టి, విక్రమార్కుని అడిగాడు. 'నేను వెయ్యి సంవత్సరాలు జీవిస్తాను . కానీ నీవు వంద సంవత్సరాలలో ప్రపంచాన్ని విడిచి వెళ్ళవలసి ఉంటుంది. నీవు లేకుండా నేను ఎలా జీవించగలను? ' అని బట్టీ నీ విక్రమార్క ప్రశ్నించ్చాడు
భట్టి కాసేపు ఆలోచించి కాశీ దేవతను ప్రార్థించాలని నిర్ణయించుకున్నాడు. కాశీ ఆలయానికి వెళ్లి తీవ్రమైన తపస్సు చేశాడు. బట్టి తపస్సును మెచ్చి దేవత ప్రత్యక్షమైనది అప్పుడు బట్టీ దేవత తో నేను రెండు వేల సంవత్సరాలు జీవించే విధం గా నన్ను ఆశీర్వదించమని కోరాడు అందుకు దేవత ఈ భూమిపై నీవు అత్యంత ఎక్కువగా ఇష్టపడే వ్యక్తిని నాకు బలి ఇవ్వాలని చెప్పి ఆమె అదృశ్యమైపోయింది భట్టి నిరాశతోరాజ్యానికి తిరిగి వచ్చాడు. అతను తన సోదరుడు విక్రమార్కని అత్యంత ఎక్కువగా ప్రేమిస్తాడు. బట్టీ బాగా ఆలోచించి,ఆలోచించి తన సోదరుడిని తనతో రమ్మని కోరాడు. వారిద్దరూ ఆలయానికి చేరుకున్నారు భట్టి, విక్రమార్క తలను నరికి దేవత పవిత్ర పాదాలకు సమర్పించాడు అప్పుడు కాళీ మాత ప్రత్యక్ష మైబట్టీ ని రెండు వేల సంవత్సరాల జీవిస్తావని ఆశీర్వదించింది.దానికి బట్టీ నవ్వుతూ, "నీవు నా సోదరుడికి తన సామ్రాజ్యాన్ని వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్థావని ఒక వరం ఇచ్చావు, కానీ అతను నీ ముందు చనిపోయి వున్నాడు. నేను నిన్ను ఎలా నమ్మగలను?"అని ప్రశ్నించాడు
అందుకు దేవత 'ఓ భట్టి! ఇది నీకు ఒక పరీక్ష మాత్రమే. నీ సోదరుడి మరణం నేను సృష్టించిన ఒక భ్రమ మాత్రమే, ఇక్కడ చూడు అంది. విక్రమార్క లేచి కాళీమాతను ప్రార్థించాడు. అప్పుడు ఆమె వారిని ఆశీర్వదించి అదృశ్యమైంది. ఆతరువాత వారిద్దరూ సంతోషంగా సామ్రాజ్యానికి తిరిగి వచ్చారు. భట్టి సంతోషంగా 'విక్రమార్కుని తో మన మిద్దరం రెండు వేల సంవత్సరాలు జీవించగలం! అన్నాడు అందుకు "విక్రమార్కుడు ఆశ్చర్యపోయాడు. అది ఎలా సాధ్యమని భట్టిని అడిగాడు. దానికి భట్టి, 'సోదరా! నీవు ప్రతి సంవత్సరం ఆరు నెలలు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించి, మిగిలిన ఆరు నెలలు మారువేషం లో సుదూర దేశాలను సందర్శించడం లో గడిపినట్లయితే, అప్పుడు నీవు రెండు వేల సంవత్సరాలు పాలించగలుగుతావు ఈ విధంగా మనమిద్దరం రెండు వేల సంవత్సరాల పాటు జీవించగలం. 'అని అన్నాడు
Comments
Post a Comment
naseerpasha262@gmail.com